బీఆర్ఎస్ అవినీతిని ప్రభుత్వం బయటకు తీస్తోంది : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

  • సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 

కరీంనగర్ సిటీ, వెలుగు : బీఆర్ఎస్ చేసిన అవినీతిని ప్రభుత్వం బయటకు తీస్తోందని, దీనిలో భాగంగా ఫార్ములా ఈ కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేసులో అవినీతికి పాల్పడిన కేటీఆర్ పై కేసు నమోదయినట్లు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. సిటీలోని సుడా ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో  మూడుసార్లు అధికారంలో ఉన్న బీజేపీ నాడు బీఆర్ఎస్ చేసిన అవినీతిపై విచారణ జరపలేదని, ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందమే అందుకు కారణమన్నారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసమే నిత్యం ఊబలాట పడుతూ, సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై  బండి సంజయ్ కుమార్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో లీడర్లు ఎండీ తాజ్, శ్రవణ్ నాయక్, ఆర్ష మల్లేశం, ఆకుల నర్సయ్య, షబానా మహమ్మద్, లత, కవిత, జ్యోతి రెడ్డి, జీడి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దన్న సింగ్, మాసుం ఖాన్ పాల్గొన్నారు.