అభివృద్ధి పనులకు సుడా నిధులు : సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి

అభివృద్ధి పనులకు సుడా నిధులు : సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి

కరీంనగర్ సిటీ, వెలుగు: ప్రజల అవసరాలకనుకూలంగా చేపట్టే అభివృద్ధి పనులకు సుడా నిధులు వెచ్చిస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం 22వ డివిజన్ పరిధిలోని శివాలయం పక్కన మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి అడిషనల్ కలెక్టర్, సుడా వైస్ చైర్మన్ ప్రఫుల్‌‌‌‌దేశాయ్‌‌‌‌తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ డివిజన్‌‌‌‌లోని 1400 మహిళా సమాఖ్య గ్రూపులకు ఉపయోగపడేలా నిర్మించునున్న భవనానికి రూ.10లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఈ రాజేంద్ర ప్రసాద్, కార్పొరేటర్ గంట కల్యాణి,  స్థానిక లీడర్లు దండి రవీందర్, ముల్కల కవిత, ఏఈ రమేశ్‌‌‌‌, సమాఖ్య సంఘాల అధ్యక్షులు జానంపేట అంజలి, సుల్తానా, లలిత, స్రవంతి, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.