
దక్షిణ ఆఫ్రికా దేశమైన సుడాన్లో పారామిలిటరీ దళాలు విధ్వంసం సృష్టించాయి. ఉత్తర డార్ఫర్ రాష్ట్రంలోని ఎల్ ఫాషర్ లో కరువు పీడిత శిబిరాలపై పారామిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో్ దాదాపు 100మందికి పైగాన పౌరులు మృతిచెందారు. మృతుల్లో 20 మంది చిన్నారులు ,9మంది ఆరోగ్య సహాయక సిబ్బంది ఉన్నారు.
గత రెండు రోజులుగా ఎల్ ఫాషర్ సిటీకి సమీపంలోని జాంజామ్, అబూ శౌఖ్ శిబిరాలపై పారామిలిటరీ దళాలు విరుచుపడ్డాయి.జాంజామ్ శిబిరంలో 9మంది ఆరోగ్య సిబ్బందిని కాల్చి చంపారని సుడాన్లోని UN నివాసి ,మానవతా సమన్వయకర్త క్లెమెంటైన్ న్క్వేటా-సలామి తెలిపారు.
►ALSO READ | మయన్మార్లో మరోసారి భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం
ఈ దాడి కారణంగా దాదాపు 2వేల400 మంది శిబిరాలు, ఎల్-ఫాషర్ నుంచి పారిపోవాలి. ఈ నగరం ఇప్పటికీ సూడాన్ సైన్యం నియంత్రణలో ఉంది. ఇది ఏప్రిల్ 2023లో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి RSFతో పోరాడుతోంది. ఈ సంఘర్షణలో 24వేలమందికి పైగా మరణించారని UN ప్రకటించింది.