సుందర్ పిచాయ్..పరిచయం చేయాల్సిన అవసరంలేని పేరు..గూగుల్ టెక్ దిగ్గజ సంస్థ అయితే.. సుందర్ పిచాయ్ టెక్ దిగ్గజం. గూగుల్ సీఈవోగా మంచి పేరును సంపాదించుకున్న భారతీయుడు. ప్రాడక్ట్ హెడ్గా ప్రస్థాన మొదలు పెట్టి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వరల్డ్ టాప్ టెక్ కంపెనీకి సీఈవోగా ఎదిగారు.ఇదంతా ఎందుకు చెపుతున్నారు అంటే..సుందర్ పిచాయ్..శుక్రవారం (ఏప్రిల్ 26)తో గూగుల్ కంపెనీలో 20ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు సుందర్ పిచాయ్.
ఏప్రిల్ 26,2004లో గూగుల్ సంస్థలో చేరాను..ఈ కంపెనీలో పనిచేయడం ద్వారా చాలా థ్రిల్ ని ఇచ్చిందన్నారు. 20ఏళ్లుగా నేను చాలా లక్కీ అని కంపెనీతో తన అనుబంధాన్ని సుందర్ పిచాయ్ పోస్ట్ లో రాశారు.కంపెనీలో చేరిన నాటి నుంచి ఇప్పటికవరకు అనేక మార్పులు తీసుకొచ్చాను. టెక్నాలజీ, మా ప్రాడక్టివిటీని ఉపయోగించే వినియోగదారులు సంఖ్యతో సహా నాజుట్టులో కూడా చాలా మార్పులు వచ్చాయని హాస్యంగా రాశాడు.
ఈ పోస్ట్ షేర్ చేసిన గంటల్లోనే లక్షా 32 వేల లైక్ లు సంపాదించింది. సుందర్ పిచాయ్ ని కంగ్రాట్స్ చేస్తూ పొగడ్తలతో ముంచెత్తారు.
సుందర్ పిచాయ్ గూగుల్ సీఈవోగా, ఆల్పాబెట్ బోర్డు డైరెక్టర్ గా సేవలందిస్తున్నారు. 2004లో సుందర్ పిచాయ్ గూగుల్ లో అడుగు పెట్టాడు. ప్రాడక్ట్ మేనేజ్ మెంట్, డెవలప్మెంట్ హెడ్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. వివిధ ప్రాడక్ట్స్, సర్వీసెస్ పై దృష్టి పెట్టి కంపెనీనీ ముందుకు నడిపించారు.
భారతీయుడిగా. టెక్ దిగ్గజంగా సుందర్ పిచాయ్ నేటి యువతకు ఆదర్శం..యువతే కాదు..అందరికీ ఆదర్శమే..