భువనేశ్వర్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ శివుడు, శివలింగం సైకత శిల్పాలు రూపొందించారు. తన స్వరాష్ట్రమైన ఒడిషాలోని పూరీ బీచ్‌లో ఈ సైకత శిల్పాలని ఆయన రూపొందించారు. ప్రపంచానికి శాంతిని ప్రసాదించాలని, ఓం నమ: శివాయ అంటూ ఈ సైకత శిల్పానికి క్యాప్షన్ ఇచ్చారు. దీని తయారీలో 23,436 రుద్రాక్షలను వాడామని తెలిపారు. ఇక సందర్భం ఏదైనా, అంశం ఎటువంటిదైనా.. తన సైకత శిల్పాల ద్వారా ప్రపంచ శాంతి కోరే సుదర్శన్ పట్నాయక్ శిల్పాలు ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
#OmmNamahShivay….Praying for Global Peace ?
— Sudarsan Pattnaik (@sudarsansand) March 1, 2022
On the occasion of Maha Shivaratri, For the first time I have used 23,436 Rudrakshya installed on My Sand art of Lord Shiva at Puri beach . pic.twitter.com/hEULvBn45M
ఇకపోతే, కోరిన వరాలిచ్చే భోళా శంకరుడిగా.. కోపం వస్తే త్రినేత్రంతో భస్మం చేసే ప్రళయ రుద్రుడిగా.. ప్రపంచాన్ని మింగేసే కాలకూట విషాన్ని గొంతులో దాచుకున్న నీలకంఠుడిగా, ఈశుడిగా, సర్వేశుడిగా, మహాదేవుడిగా ఎన్నో రూపాల్లో.. ఇంకెన్నో పేర్లతో.. భక్తుల కష్ట, సుఖాల్లో పరమశివుడు వెన్నంటే ఉంటాడు. అటువంటి పరమశివుడు పార్వతి దేవిని పెండ్లాడింది ఈ రోజే. లింగ రూపంలో ఆవిర్భవించింది కూడా ఈరోజే అని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈరోజును మహాశివరాత్రిగా ఊరూవాడా ఘనంగా జరుపుకుంటోంది.
మరిన్ని వార్తల కోసం: