- బీజేపీ మేడ్చల్ జిల్లా నాయకులు హెచ్చరిక
శామీర్ పేట, వెలుగు: శామీర్ పేట పంచాయతీని తూముకుంట మున్సిపాలిటీలో విలీనం చేస్తే ఎంపీ ఈటల రాజేందర్ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని బీజేపీ మేడ్చల్జిల్లా నాయకుడు సుదర్శన్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విలీనం ఆలోచనను విరమించుకోవాలని కోరారు. సుదర్శన్బుధవారం శామీర్ పేటలో మీడియాతో మాట్లాడారు. శామీర్పేట విలీనాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
శామీర్ పేట మండల కాంగ్రెస్ నాయకులు స్పందించి, విలీన ప్రక్రియను ఆపించాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రమేశ్, బీజేపీ నాయకులు మురళి, పవన్, శివ తదితరులు పాల్గొన్నారు.