సుదర్శన్​రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి

సుదర్శన్​రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి

మోపాల్,  వెలుగు :  సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్​ పార్టీ సీనియర్​నాయకుడు మాజీ మంత్రి, బోధన్​ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్​ జిల్లా ఆదివాసి గిరిజన  సంఘం చైర్మన్ యాదగిరి సీఎం రేవంత్​రెడ్డిని కోరారు. ఆదివారం మోపాల్​ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉమ్మడి రాష్ట్రంలో సుదర్శన్​రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండి జిల్లాలోని సాగునీటి సమస్యను పరిష్కరించారని,  ప్రాణహిత చేవెళ్ల పథకంతో నిజామాబాద్​రూరల్​ నియోజకవర్గంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయవంతంగా సాగుతుందన్నారు.  సుదర్శన్​రెడ్డి మంత్రి పదవి కేటాయించాలని కాంగ్రెస్​ జిల్లా నేతలు సీఎం రేవంత్​రెడ్డి కలిసి వినతి పత్రాలను సైతం అందజేస్తామని తెలిపారు. సమావేశంలో డీసీఎంస్ చైర్మన్​తారాచంద్​నాయక్, నాయకులు, చంద్రునాయక్, బున్నేరవి, రవినాయక్​ పాల్గొన్నారు.