కాంగ్రెస్​ను బలోపేతం చేసేందుకు మండవను ఆహ్వానించాం: సుదర్శన్​రెడ్డి 

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో కాంగ్రెస్​ను మరింత బలోపేతం చేయడానికి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావును పార్టీలోకి ఆహ్వానించామని మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆకుల లలితను ఆహ్వానించలేదన్నారు. గురువారం ఆయన నిజామాబాద్​లోని డీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మండవకు టికెట్​గ్యారెంటీ ఇచ్చారా అని ప్రశ్నించగా లాంటిదేమీ లేదన్నారు.

బీఆర్ఎస్​గవర్నమెంట్​లో ప్రజల పడుతున్న కష్టాలను తెలుసుకొని భరోసానివ్వడానికి వస్తున్న రాహుల్​ను ఎమ్మెల్సీ కవిత టూరిస్టుగా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. కాంగ్రెస్​ పార్టీ దేశానికి ఎంతో సేవ చేసిందని, ఆ కుటుంబానికి చెందిన నేత గురించి చులకనగా మాట్లాడడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ కవితకు రాహుల్​ పై కామెంట్​ చేసే స్థాయి లేదన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​మహేశ్​గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్​హవా నడుస్తుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, డాక్టర్​భూపతిరెడ్డి, తాహెర్, కేశవేణు పాల్గొన్నారు.

ఇయ్యాల రాహుల్​ పర్యటన

ఆర్మూర్​కు శుక్రవారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్​గాంధీ వస్తున్నారు. జిల్లా సరిహద్దులోని కమ్మర్​పల్లికి మధ్నాహ్నం 1.30 నిమిషాలకు చేరుకొని మోర్తాడ్​ బస్టాండ్​వద్ద కార్నర్​ మీటింగ్ ​నిర్వహిస్తారు. అక్కడి నుంచి పెర్కిట్​హైవే బ్రిడ్జి మీదుగా బస్సుయాత్ర ర్యాలీతో 3 గంటలకు అంబేద్కర్​చౌరస్తా చేరుకొని కార్నర్​ మీటింగ్​లో ప్రసంగిస్తారు. అనంతరం శంషాబాద్​ఎయిర్​పోర్ట్​కు వెళ్తారు. సమయాభావంతో నిజామాబాద్, బోధన్​ ప్రోగ్రామ్స్​ను రద్దు చేశారు.