సుద్దాల అశోక్ తేజ ఆపరేషన్ సక్సెస్

ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ కాలేయ వ్యాధితో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు చేసిన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైందని ఆయన కుమారుడు అర్జున్ తేజ తెలిపారు. అశోక్ తేజ చిన్న కొడుకు అయిన అర్జున్ తేజ కాలేయ దానం చేశారు. గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రిలో శనివారం ఉదయం 9:30 గంటలకు మొదలైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స సాయంత్రం 6 గంటల వరకు కొనసాగిందని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత తండ్రీకొడుకులిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. అశోక్ తేజ సోదరుడు అయిన సుద్దాల సుధాకర్ తేజ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాస్తు సలహాదారుడుగా పనిచేస్తున్నారు.