హర్యానాలో ఒక్కసారిగా మారిన ట్రెండ్.. పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ

హర్యానాలో ఒక్కసారిగా మారిన ట్రెండ్.. పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ

హర్యానా రౌండ్ రౌండ్ కు అంచనాలు మారుతున్నాయి..ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగా మొదట కాంగ్రెస్ దూసుకెళ్లింది. అయితే రౌండ్ రౌండ్ కి అంచనాలు మారుతున్నాయి. అతితక్కువ స్థానాల్లో లీడ్ లో ఉన్న బీజేపీ ఒక్కసారిగా పుంచుకుంది. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి.  రెండు పార్టీలు మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో ఉన్నాయి. 

అయితే కాంగ్రెస్ బీజేపీలకు చెందిన ప్రముఖులు వెనుకంజలో ఉన్నారు. అంబాలా కాంట్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బీజేపీ అగ్రనేత అనిల్ విజ్ వెనుకంజ ఉన్నారు. అసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కూడా పోటీలో ఉన్నారు. జులానా నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ కూడా వెనుకంజలో ఉన్నారు.