హైదరాబాద్ లో పబ్ లపై ఆకస్మిక తనిఖీలు.. 50మంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తింపు..

హైదరాబాద్ లో పబ్ లపై ఆకస్మిక తనిఖీలు.. 50మంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తింపు..

హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ కట్టడి చేస్తున్నప్పటికీ తరచూ పబ్స్ లో డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో పబ్స్ లో నిర్వహించిన తనిఖీల్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. జూబ్లీహిల్స్ లో శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు పోలీసులు.

ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 12 బృందాలు పాల్గొన్నాయి. పలు పబ్స్ లో అనుమానితులకు స్పాట్ డ్రగ్ టెస్టింగ్ కిట్లతో పరీక్షలు నిర్వహించగా 50మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. 

ఈ క్రమంలో పబ్ యాజమాన్యాలను పోలీసులు గట్టిగా హెచ్చరించారు. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ డ్రైవ్ లో భాగంగా ఇటువంటి తనిఖీలు మరిన్ని జరుగుతాయని తెలిపారు. కస్టమర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతించాలని, పబ్ సిబ్బంది ఎవరైనా డ్రగ్ సంబంధిత నేరాలకు పాల్పడితే  ఆ పబ్ లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు.