హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాదాపూర్ డీ మార్ట్ ఎదురుగా ఉన్న కృష్ణ కిచెన్ రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. అనూహ్యంగా మంటలు చెలరేగడంతో కస్టమర్లు, వర్కర్లు బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సేఫ్టీ అధికారులకు రెస్టారెంట్ యాజమాన్యం సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సేఫ్టీ అధికారులు ఇంజన్ మంటలు ఆర్పుతున్నారు. ఫైర్ ఇంజిన్ సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు అధికారులు.
రెస్టారెంటులో ఉన్నట్లుండి మంటలు చెలరేగడంతో కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. ముందుగానే ప్రమాదాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే రెస్టారెంట్ లో ఉన్న ఫర్నీచర్ చాలా వరకు కాలిపోయిందని హోటల్ యాజమాన్యం తెలిపింది. షాక్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని యాజమాన్యం తెలిపింది.
ALSO READ | కిక్కే కిక్కు : హైదరాబాద్ సిటీలో బార్ అండ్ రెస్టారెంట్ లో రికార్డింగ్ డాన్సులు