ప్యాట్నీ ఫ్లై ఓవర్ పై కారులో మంటలు

ప్యాట్నీ ఫ్లై ఓవర్ పై కారులో మంటలు

సికింద్రాబాద్: నిత్యం రద్దీగా ఉండే ప్యాట్నీ సెంటర్ ఫ్లై ఓవర్ పై కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫ్లై ఓవర్ డ్జి పై ప్రయాణిస్తున్న ఓ కారు ఇంజన్ భాగంలో మంటలు చెలరేగడం గుర్తించి కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే కారు ఆపి దిగిపోయారు. వారు దిగడమే ఆలస్యం అన్నట్లు మంటలు ఒక్కసారిగా పెద్దగా మారాయి. అందరూ చూస్తుండగానే క్షణాల్లో కారు అగ్నికి ఆహుతి అయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.