
జాతీయ రహదారి మీద వేగంగా వెళ్తోన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంపెద్దాపూర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. కారు ఇంజన్ ఫెయిలై షాట్ సర్క్యూట్ తో కారులో మంటలు వ్యాపించినట్టు సమాచారం అందుతోంది.
ఏడుగురు వ్యక్తులు కారులో ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో కారులో ఆకస్మికంగా మంటలు చేలరేగాయని బాధితులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్దం కాగా, అదృష్టవశాత్తూ కారులో ప్రయాణిస్తున్న వారు చాకచక్యంగా సురక్షితంగా బయటపడ్డారు.ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.