హైదరాబాద్‎లో 110చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక రైడ్స్

హైదరాబాద్‎లో 110చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక రైడ్స్

హైదరాబాద్‎లో మోమోస్ తిని మహిళ మృతి చెందగా.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. మంగళవారం (అక్టోబర్ 29) హైదరాబాద్‎లోని మోమోస్ తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేశారు. 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 110 మోమోస్ తయారీ కేంద్రాల్లో రైడ్స్ నిర్వహించారు. 69 మోమోస్ తయారీ కేంద్రాల్లో అధికారులు శాంపిల్స్ సేకరించారు. అన్ హైజినిక్‎గా మోమోస్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించి మోమోస్ తయారు చేస్తున్న కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.