బర్సపరా స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిస్తోంది. ఆకస్మిక వర్షం కురవడంతో సిబ్బంది మైదానాన్ని అంతటిని కవర్లతో కప్పి ఉంచారు. దీంతో టాస్ ఆలస్యమవుతోంది.
వాతావరణ నివేదికల ప్రకారం, ఆదివారం గౌహతిలో వర్షాలు కురిసే అవకాశం 7 శాతం మాత్రమే ఉంది. అంటే ఎలాంటి వర్షపు జాడ లేదని అర్థం. అలాంటిది.. వరుణుడు ఎంట్రీ ఇచ్చాడంటే ప్రజలకు వాతావరణ శాఖపై నమ్మకాన్ని వమ్ము చేయడానికే అని స్పష్టమవుతోంది.
A steady drizzle in Guwahati delays the toss #KKRvRR
— ESPNcricinfo (@ESPNcricinfo) May 19, 2024
👉https://t.co/F4d2Zv3pvl pic.twitter.com/WKlbJgkgU4
ఇక, ప్రస్తుతానికి కోల్‌కతా 14 మ్యాచ్ ల్లో తొమ్మిది విజయాలతో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోగా.. సంజూ సేన 13 మ్యాచ్ ల్లో ఎనిమిదింట గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. కోల్‌కతా చేతిలో ఓడినా/ మ్యాచ్ రద్దయినా రాజస్థాన్.. మూడో స్థానానికి పరిమితమవవుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిస్తే 18 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వెనక్కి నెడుతుంది.
SRH IN TOP 2 IN THE POINTS TABLE. 💥 pic.twitter.com/4GGgT5eg3r
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 19, 2024