మితిమీరిన మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అయినా చాలా మంది మద్యం తాగడం మానుకోవాలని అనుకోరు. అయితే మద్యం రోజూ తాగినా అప్పుడప్పుడు తాగినా సరే ఇది శరీరంలోకి వెళ్లి కీలక అవయవాలపై ప్రభావం చూపుతుంది.ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లిన తర్వాత ఏం జరుగతుందనే విషయం చాలా మందికి తెలియదు. అయితే రోజూ మద్యం తాగే వారు షడన్ గా మానేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఉన్నట్టుండి ఆల్కహాల్ తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. . .
ఆల్కహాల్ తాగడం సడన్ గా మానేస్తే కొందరిలో తీవ్రమైన సమస్యలు కనిపిస్తాయి. దీనినే విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. అయితే మద్యం హఠాత్తుగా మానేస్తే కొంతమందిలో టెన్షన్, అలసట కనిపిస్తాయి. కొన్నేళ్లు మద్యం తాగి మానేస్తే మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కొంతమంది మద్యం తాగడం మానిస్తే చెవుల్లో పెద్ద, పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయని చెబుతున్నారు. అంతే కాకుండా ఎవరో తమను పిలుస్తున్నట్టు కూడా అనిపిస్తుందట. దీనినే ఆల్కహాల్ ప్రేరేపిత బ్రాంతి అని పిలుస్తారు.
ఏళ్ల తరబడి మద్యం తాగి.. ఏదో ఒక కారణంతో తాగడం మానేస్తే వారిలో మూడు రోజుల్లోపు మానసిక సమస్యలు తలెత్తుతాయి. కోపం, ముందు ఏం ఉందో తెలియని పరిస్థితి, అయోమయంలోకి వెళ్లిపోతారు. చాలా మంది సరైన ఆహారం తీసుకోకుండా రేయింబవళ్లు మద్యం తాగుతుంటారు. అలాంటి వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కామెర్లు రక్తం గడ్డకట్టడంతో పాటు మెదడులో కణజాలాన్ని కూడా ఆల్కహాల్ ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.
షడన్ గా ఆల్కహాల్ మానేయడం వల్ల వచ్చే మానసిక సమస్యలు పెరిగితే ఆ తర్వాతి దశలో అది న్యూరోలాజికల్ సమస్యలకు దారితీస్తుంది. ఈ దశలో వారు అన్నింటినీ మర్చిపోతుంటారు. ఇది ఎలా ఉంటుందంటే అకస్మాత్తుగా ఒక ప్రశ్న అడిగి దానికి సమాధానం చెప్పేలోపే వారూ ఆ ప్రశ్న అడిగారా లేదా అన్న విషయాన్ని కూడా మర్చిపోతారు. తమకు మతిమరుపు ఉందనే విషయాన్ని చెప్పకుండా ఏదో ఒకటి చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. దీనికి తోడు నరాలకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది.
అయితే ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలనుకొనే వారు క్రమేణ తగ్గించుకుంటూ రావాలి. ఒక నెల పాటు వారానికి రెండు సార్లు.. తరువాత వారానికి ఒకసారి ఇలా తగ్గించుకుంటే వస్తే శరీరంపై ఎలాంటి దుష్ప్రభవాలు ఉండవని వైద్యులు చెబుతున్నారు.