ఇష్టముంటే ఎంత సేపైనాపని చేయొచ్చు: సుధా మూర్తి

ఇష్టముంటే ఎంత సేపైనాపని చేయొచ్చు: సుధా మూర్తి

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన ‘వారానికి 70 గంటల పని’ కామెంట్స్​పై  ఆయన భార్య సుధా మూర్తి స్పందించారు. ప్యాషన్​ ఉంటే పనిచేయడానికి టైమ్ లిమిట్ లేదని ఆమె అన్నారు. కెరీర్ ప్రారంభంలో  నారాయణ మూర్తి వారానికి 70 గంటల కంటే ఎక్కువ పనిచేసేవారని, ఇన్ఫోసిస్ ఈ రోజు ఈ స్థాయికి చేరుకోవడానికి హార్డ్‌‌వర్క్‌‌, లక్‌‌  కారణమని పేర్కొన్నారు. డాక్టర్లు, లాయర్లు వంటి వివిధ ఫీల్డ్‌‌లలోని చాలా మంది అంకిత భావంతో పనిచేస్తున్నారని, టైమ్‌‌ గురించి ఆలోచించడం లేదని వివరించారు. 

కాగా, ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే  యువత వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలని  2023 లో ఓ పాడ్‌‌కాస్ట్‌‌లో నారాయణ మూర్తి పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌‌పై సోషల్ మీడియాలో చాలా విమర్శలు వచ్చాయి.