సుధా మూర్తి... ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ అత్త.. ఇలా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ ఆమె చాలా సాధరణమైన జీవితాన్ని గడపడానికే ఇష్టపడుతారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
తాను ప్యూర్ వెజిటేరియన్ అని వెల్లడించిన సుధామూర్తి. ఇండియాలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా తన ఫుడ్ తానే తీసుకెళుతానని చెప్పుకొచ్చింది. వెజ్ కు. నాన్‌వెజ్ కు ఓకే చెంచా ఉపయోగించడం తనకు నచ్చదని తెలిపింది. అందుకే తాను హోటళ్లను ఎంపిక చేసుకునేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తానని ఆమె చెప్పడంతో కొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమె అల్లుడు, బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ మాంసాహారి అనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఆయనను ఆయన పిల్లలను ముట్టుకోవద్దని సలహా ఇస్తున్నారు.
ALSO READ :ఆ దేవుడే రాయించాడు.. ఒక్క సెంటీమీటీర్ పుస్తకంలో హనుమాన్ చాలీసానా..
తనకు ఇప్పటికీ గుడ్డు, వెల్లుల్లి కూడా తిననని సుధామూర్తి వెల్లడించింది. విదేశాలకు వెళ్ళినప్పుడు వెజిటేరియన్ రెస్టారెంట్ కోసం వెతుకుతానని, ముందు జాగ్రత్తగా తన హ్యాండ్ బ్యాగ్ నిండుగా తినుబండారాలను తీసుకెళ్తానని చెప్పుకొచ్చింది. తన వద్ద ఓ కుకింగ్ బ్యాగ్ ఉందని అందులో చిన్న కుక్కర్ కూడా ఉందని వెల్లడించింది. ఇవన్నీ తన అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానని చెప్పిన సుధామూర్తి తాను ఏ దేశానికి వెళ్లిన తన ఫుడ్ ను తానే తీసుకువెళ్తానని వెల్లడించింది.