వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి: సుధాకర్ లాల్

లింగాల, వెలుగు : వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ  వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్​వో సుధాకర్ లాల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి, అంబటిపల్లి పీహెచ్​సీని సందర్శించారు.  రికార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. 

అనంతరం మాట్లాడుతూ విష జ్వరాలు ఎక్కువగా విజృంభిస్తున్నందున ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించాలన్నారు.  వైద్యసేవల్లో  నిర్లక్షంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ఆశ వర్కర్లు, ఏఎన్ఎం లు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట వైద్యాధికారి శివశంకర్, తదితరులు ఉన్నారు.