సూర్యాపేట, వెలుగు : గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని సుధాకర్ పీవీసీ ఎండీ మీలా మహదేవ్ అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం సుధాకర్ పీవీసీ సహకారంతో విద్యార్థిని విద్యార్థుల భాగస్వామ్యం కోసం మన పర్యావరణం - మన బాధ్యత అంశంపై రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఫిబ్రవరి 8న ప్రారంభమైన కార్యక్రమంలో 30 రోజుల్లో 75 పాఠశాలల్లో విజయవంతంగా పూర్తి చేసుకోవడాన్ని అభినందించారు.
ఇందులో 5 వేల మంది విద్యార్థులు పాల్గొనగా.. 15 వేల మందికి అవగాహన కల్పించారు. 500 మంది విజేతలైన విద్యార్థిని విద్యార్థులకీ లక్ష రూపాయల విలువైన బహుమతులు ప్రశంసాపత్రాలు అందజేశారు. అధ్యక్షుడు ముప్పారపు నరేందర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తోట కిరణ్, కోశాధికారి ఉప్పల శ్రావణ్, ఈసీ మెంబర్స్ ముప్పారపు నాగేశ్వరరావు, వనమాల వెంకటేశ్వర్లు, గెల్లి అంజన్ ప్రసాద్ పాల్గొన్నారు.