
సినిమా, సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ కొత్త తరహా స్ర్కిప్టులను సెలెక్ట్ చేసుకుంటున్నాడు సుధీర్ బాబు. ఇప్పుడు ఏకంగా మూడు డిఫరెంట్ గెటప్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తను హీరోగా నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఇందులో సుధీర్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. ఇటీవల హెవీ వెయిట్ ఉన్న ‘దుర్గ’గా, ఓల్డ్ డాన్ ‘పరశురామ్’గా రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్‌తో సర్‌ప్రైజ్ చేశాడు సుధీర్ బాబు. మంగళవారం ‘డీజే’ అనే క్యారెక్టర్‌ను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో టీ షర్ట్, జీన్స్ వేసుకుని, హెడ్‌సెట్‌తో ట్రెండీగా కనిపిస్తున్నాడు. ఈషా రెబ్బా, మృణాళిని రవి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.