Harom Hara Official OTT: ఓటీటీలోకి యాక్షన్ డ్రామా హరోం హర..స్ట్రీమింగ్‌ ఎప్పుడు..ఎక్కడంటే?

Harom Hara Official OTT: ఓటీటీలోకి యాక్షన్ డ్రామా హరోం హర..స్ట్రీమింగ్‌ ఎప్పుడు..ఎక్కడంటే?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) హీరోగా ‘సెహరి’ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రిలీజై ఆకట్టుకున్న పాన్ ఇండియా మూవీ ‘హరోం హర’(Harom Hara).ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ఆహా(Aha) సొంతం చేసుకున్న తెలిసిందే. తాజాగా హరోం హర జూలై 11న ఆహాలో స్ట్రీమింగ్ కు రానుందని తెలుపుతూ అధికారిక ప్రకటన చేసింది.

'బలవంతుడికి ఆయుధం అవసరం..కానీ,బాలహీనుడికి ఆయుధమే బలం!'అంటూ ట్వీట్ చేసింది.ఈ మూవీని తెలుగు ప్రాంతాల వరకే కాకుండా..పాన్ ఇండియా లెవెల్లో నిర్మించారు.సుధీర్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా..శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మించింది. 

కథ:

ఆంధ్రప్రదేశ్,కర్ణాటక,తమిళనాడు మూడు సరిహద్దులు కలిసే ప్రాంతం కుప్పం.ఆ ఊరును తిమ్మారెడ్డి అతని సోదరులు తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. అదే సమయంలో కుప్పం పాలిటెక్నిక్ కాలేజీలో ఆ ఊరికి వస్తాడు సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు).అనుకోకుండా ఒకవ్యక్తితో గొడవ జరిగి కాలేజీ నుంచి సస్పెండ్ అవుతాడు.ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడటానికి తన స్నేహితుడైన పళని స్వామి(సునీల్)తో కలిసి గన్ తయారీ మొదలు పెడతాడు.అలా గన్ తయారీ మొదలుపెట్టిన సుబ్రహ్మణ్యం..జీవితం తరువాత ఎలాంటి మలుపులు తిరిగింది? ఉద్యోగం పోవడానికి కారణమైన వ్యక్తితో సుబ్రహ్మణ్యం ఎందుకు చేతులు కలిపాడు? సుబ్రహ్మణ్యం ఆ ఊరికి  దేవుడు ఎలా అయ్యాడు? అనేది మిగిలిన కథ?