OTT Family Drama: ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు ఫ్యామిలీ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Family Drama: ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు ఫ్యామిలీ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్‌‌‌‌‌‌తో డైరెక్టర్ అభిలాష్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

తండ్రీ కొడుకుల ఎమోష‌న్‌తో తెర‌కెక్కిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, బాక్సాఫీస్ దగ్గర మాత్రం మంచి వసూళ్లు సాధించలేకపోయింది. గ‌త సినిమాల‌కు భిన్నంగా ఔట్ అండ్ ఔట్ ఎమోష‌న‌ల్ రోల్‌లో సుధీర్‌బాబు నటించడంతో.. నటుడిగా మరో మెట్టు ఎక్కాడు.

ఇప్పుడీ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కి సిద్దమయ్యింది. "సూపర్ హీరో తండ్రులందరికీ.. కొడుకు యొక్క అందమైన & భావోద్వేగ ప్రయాణాన్ని నవంబర్ 15న జీ5 ఓటీటీలో చూడండి" అంటూ మేకర్స్ ప్రకటించారు. 

కథేంటంటే::

జానీ (సుధీర్ బాబు) పుట్టుకతోనే త‌ల్లికి దూర‌మ‌వుతాడు. ఓ లారీ డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే తండ్రి ప్రకాశ్ (సాయిచంద్) గంజాయి కేసులో జైలు పాల‌వ్వ‌డంతో జానీ అనాథ‌గా మారిపోతాడు. దీంతో జానీ చిన్నతనం నుంచి అనాథ‌శ్ర‌మంలో పెరుగుతాడు. ఆ అనాథాశ్రమం నుంచి పిల్లలు లేని స్టాక్ బ్రోక‌ర్‌ అయిన శ్రీనివాస్‌ (షాయాజీ షిండే) జానీని దత్తత తీసుకుని పెంచుకుంటాడు. కానీ జానీని దత్తత తీసుకున్న తర్వాత అతనికి వ్యాపారాల్లో నష్టం రావడం, ఊరంతా అప్పులు చేయడం మొదలవుతాయి. ఇక జానీ రావడం వల్లే తనకు దురదృష్టం అని భావించి.. కొన్నాళ్ల తర్వాత కొడుకుని పట్టించుకోవడం పూర్తిగా మానేస్తాడు. అంతేకాకుండా జానీ ఇంటికి వచ్చాకే శ్రీనివాస్ భార్య (ఆమ‌ని) చ‌నిపోతుంది. ఇక కొడుకు వ‌ల్లే త‌న జీవితం నాశ‌న‌మైంద‌ని జానీని పూర్తిగా ద్వేషిస్తుంటాడు శ్రీనివాస్‌. కానీ, జానీ మాత్రం ఓ అనాథగా బ్రతికే నాకు.. కుటుంబాన్ని ఇచ్చిన శ్రీనివాస్‌ను సొంత తండ్రి కంటే ఎక్కువ‌గా ప్రేమిస్తు..ఆరాధిస్తుంటాడు. శ్రీనివాస్ ఎంత ద్వేషిస్తే అంత‌కుమించి తండ్రిపై జానీ ప్రేమ‌ను కురిపిస్తుంటాడు.

అలా ఓ సమయంలో లోకల్ లీడర్ కి శ్రీనివాస్ కోటి రూపాయలు కట్టాల్సి వస్తుంది. దీంతో ఆ లీడర్‌ శ్రీనివాస్‌పై ఛీటింగ్‌ కేసు పెట్టగా, పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చితక్కొడుతుంటారు. ఈ విషయం తెలిసి జానీ తన తండ్రిని కాపాడుకునే ప్రయత్నంలో చాలా విధాలుగా పోరాడుతాడు. ఇక తన తండ్రిని వదిలేయాలంటే కోటీ రూపాయలు కట్టాలని చెప్పడంతో.. ఆ డబ్బుల కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. దీంతో తండ్రిని ర‌క్షించుకునేందుకు ఆ అప్పు బాధ్య‌త‌ను త‌న భుజానికెత్తుకుంటాడు.

కట్‌ చేస్తే 20ఏళ్ల త‌ర్వాత జైలు నుంచి విడుదలైన ప్రసాద్‌ తన కొడుకు కోసం వెతుకుతుంటాడు. అతని పేరు కూడా తెలియకపోవడంతో ఎలా వెతకాలో కూడా అర్థంకాక బాధపడుతుంటాడు. ఒకవైపు డబ్బుల కోసం జానీ, మరోవైపు కొడుకు జాడ కోసం ప్రకాష్ ఇలా ఒకరికొకరు తమ ప్రయత్నాలు ఎలా చేశారు? మరి జానీ పెంచినతండ్రి అప్పులను తీర్చాడా? కన్నతండ్రిని కలుసుకున్నాడా? ప్రసాదే తన సొంత నాన్న అని జానీకి ఎలా తెలుస్తోంది?  అసలు ప్రకాష్ జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనే తదితర విషయాలు తెలియాలంటే థియేట‌ర్ల‌లో చుడనివారు ఓటీటీలో సినిమా చూడాల్సిందే.