సుధీర్ బాబు, ఆర్ణ జంటగా నటించిన చిత్రం "మా నాన్న సూపర్ హీరో". ఈ చిత్రానికి నూతన డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించగా సునీల్ బలుసు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని తండ్రి సెంటిమెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు మరియు టీజర్ ని విడుదల చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవలే విడుదలైన ‘మా నాన్న సూపర్ హీరో చిత్ర ట్రైలర్ విశేషాలేంటో చేసేద్దాం పదండి.
తండ్రిని అమితంగా ప్రేమించే కొడుకు పాత్రలో సుధీర్ బాబు కూల్‌గా కనిపించాడు. సాయాజీ షిండే, సాయి చంద్ విభిన్న పాత్రలలో ఆకట్టుకున్నారు. డబ్బుకోసం చిన్నప్పుడే సుదీర్ బాబు ని అమ్మేసిన సీన్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత తండ్రీ కొడుకుల మధ్య సాగే ఎమోషన్ సన్నివేశాలు, కళ్ళజోడు పెట్టుకుంటే ప్రపంచం మారిపోదు, అలాగే ప్రేమతో చేసినంతమాత్రాన తప్పు తప్పుకాకుండా పోదు అంటూ సుదీర్ బాబు చెప్పే డైలాగులు మొత్తం ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాయి. దీంతో తన తండ్రితో సుధీర్ బాబుకు ఉన్న డీప్ ఎమోషనల్ బాండ్‌ని చూపిస్తూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.
ఈ విషయం ఇలా ఉండగా మా నాన్న సూపర్ హీరో చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందు రాబోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న హీరో సుధీర్ బాబు ఈ చిత్రంతో సక్సెస్ కొట్టి హిట్ ట్రాక్ ఎక్కాలని ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ ఫాదర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతోందో లేదో చూడాలి.
సుధీర్ బాబు, ఆర్ణ జంటగా నటించిన చిత్రం "మా నాన్న సూపర్ హీరో". ఈ చిత్రానికి నూతన డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించగా సునీల్ బలుసు నిర్మాతగా వ్యవహరించారు.