సుధీర్ బాబు కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..

సుధీర్ బాబు కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..


టాలీవుడ్ స్టార్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం "మా నాన్న సూపర్ హీరో" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయాజీ షిండే, ఆమని, సాయి చంద్, రాజు సుందరం, శశాంక్ తదితరులు ఇస్తారా సహాయక పాత్రల్లో నటించారు. ఫాదర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇటీవలే విదులయ్యింది. 

కాగా ఈ ఏడాది అక్టోబర్ 11వ తారీఖున థియేటర్లో విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేశారు. అంతేగాకుండా మా నాన్న సూపర్ హీరో చిత్ర టీజర్ ని కూడా యూట్యూబ్ లో విడుదల చేశారు. 

ఈ టీజర్ ని ఒకసారి చూసినట్లయితే ఈ చిత్రంలో హీరో సుధీర్ బాబు మెకానిక్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సుధీర్ బాబుకి హీరో తండ్రి పాత్రలో సాయాజీ షిండేతో జరిగే సంభాషణలు, సాయి చాంద్ తో సాగే ఎమోషనల్ సన్నివేశాలు ట్రైలర్ కి హైలెట్ గా నిలిచాయని చెప్పవచ్చు. మరి మా నాన్న సూపర్ హీరో చిత్రం థియేటర్లో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.