మల్టీ లేయర్స్ ఉన్న కమర్షియల్ సినిమా మామా మశ్చీంద్ర : సుధీర్ బాబు

సుధీర్ బాబు మామా అల్లుళ్లుగా, ట్రిబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ఈనెల 6న సినిమా విడుదలవుతున్న సందర్భంగా  సుధీర్ బాబు ఇలా చిత్ర విశేషాలని పంచుకున్నాడు.  ‘‘నా దగ్గరకి వచ్చిన కథల్లో నాకు నచ్చినవి ఎంపిక చేసుకునే నేను, ఫస్ట్ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్షవర్ధన్ పై ఉన్న నమ్మకంతో కథ చేసుకుని రమ్మని చెప్పాను. డిఫరెంట్ స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకొచ్చాడు. చాలా నచ్చింది. మనం, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి చిత్రాలకు రైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేసిన తనకు సినిమాలపై మంచి పట్టువుంది. 

ఇందులో మూడు పాత్రలకు మూడు డిఫరెంట్ యాసలు ఉంటాయి. ఒక పాత్ర తెలంగాణ, మరొకటి ఉత్తరాంద్ర, ఇంకో పాత్రకు రాయలసీమ యాస వుంటుంది. అలాగే ప్రతి పాత్రకు వేరియేషన్ ఉంటుంది. ఒక క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కొంత బరువు పెరిగాను. మరో పాత్రకు ఏకంగా 120 కిలోల బరువు పెరగాలనుకున్నా. కానీ మహేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు చాలామంది వెల్ విషర్స్ వద్దని వారించడంతో ప్రోస్తటిక్ మేకప్ వాడాం. ఈ సినిమా మెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే కాక ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఓ చాలెంజ్. మల్టీ లేయర్స్ ఉన్న కథ ఇది. అందులో సెంట్రల్ లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పరశురాం పాత్ర ఉంటుంది. 

తన క్యారెక్టర్ మిగతా పాత్రలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించిందనేది ఆసక్తికరంగా సాగుతుంది. కథలో చాలా మలుపులు, ట్విస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉంటాయి. కామెడీ కూడా చాలా కొత్తగా ప్రయత్నించాం. కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమా ఇది. ఫ్యామిలీ అంతా కలసి హాయిగా చూడొచ్చు. నిర్మాతలుగా సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ గారు ఈ సినిమాకి పూర్తి న్యాయం చేశారు”.