మహిళా కమిషన్ ముందు అటెండైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

 మహిళా కమిషన్ ముందు అటెండైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
  • కార్పొరేటర్ సుజాతపై చేసిన కామెంట్లకు వివరణ

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మంగళవారం మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని సుజాత నాయక్.. మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేకు కమిషన్ నోటీసులు ఇచ్చింది. 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున తరువాత అటెండ్ అవుతానని ఈ ఏడాది మార్చ్ లో సమాధానం ఇచ్చి మంగళవారం అటెండ్ అయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద పలు ప్రశ్నలు అడిగారు. కమిషన్ కు రాత పూర్వకంగా సుధీర్ రెడ్డి వివరణ ఇచ్చారు.  ఆయన వివరణను కమిషన్ పరిశీలించి, తరువాతి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.