- నేషనల్ సెక్రటరీగా కాసర్ల యాదగిరికి బాధ్యతలు
కోల్‌బెల్ట్, వెలుగు : మాల మహానాడు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా మంచిర్యాలకు చెందిన జూపాక సుధీర్‌ను నియమిస్తూ ఆ సంఘం నేషనల్ ప్రెసిడెంట్పసుల రామ్మూర్తి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ కార్యదర్శిగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన కాసర్ల యాదగిరి, నేషనల్ వైస్ ప్రెసిడెంట్‌గా ముత్తమాల పుల్లయ్య, స్టేట్ వైస్ ప్రెసిడెంట్‌గా సోగాల కిష్టయ్య, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు ఎరుకల శ్రీనివాస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు.
ఈ సందర్భంగా సుధీర్, యాదగిరి మాట్లాడుతూ.. దళితుల ఐక్యత, అంబేద్కర్ ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తామని, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. తమ ఎంపికకు కృషిచేసిన నేషనల్ ప్రెసిడెంట్, మాలమహానాడు శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.