మహారాష్ట్రలో బీఅర్ఎస్ పార్టీ ప్రభావం ఉండదని ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ మునిగంటి వార్ అన్నారు. వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సీఎం హోదాలో ఉన్న కేసీఆర్.. తన కూతుర్ని గెలిపించుకోలేదని.. అలాంటిది దేశాన్ని ఎలా ఏలుతాడంటూ విమర్శించారు. దేశంలో ఎన్ని పార్టీలు వచ్చిన బీజేపి ముందు నిలబడవన్న ఆయన.. దేశాన్ని నడిపించే సత్తా ప్రధాని మోడీకి మాత్రమే ఉందన్నారు.
బీజేపీకి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనేనని.. బీఅర్ఎస్ పార్టీది ఇక పోయేకాలమేనని అన్నారు. దేశంలో కేసీఆర్ హవా వస్తది అనేది ప్రాపగండ మాత్రమేనన్నారు. గుజరాత్ లాగే అన్ని రాష్ట్రాలలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. మూడు స్థానాలు ఉన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో50 స్థానాలను సాధించామని, వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తమన్నారు.