చెన్నూరు, వెలుగు: ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం సాయంత్రం కేంద్ర బలగాలతో చెన్నూరులో పోలీస్ కవాతు నిర్వహించారు.
అయ్యప్ప టెంపుల్ నుంచి కొత్తగూడెం కాలనీ, గాంధీ చౌక్, శివాలయం, చాకలివాడ మీదుగా పోలీస్స్టేషన్ వరకు కవాతు సాగింది. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రజలకు ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జైపూర్ ఏసీపీ మోహన్, పట్టణ సీఐ వాసుదేవరావ్, నియోజకవర్గ ఆర్ ఓ దత్తు, జైపూర్ సబ్ డివిజన్ సీఐలు,ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.