వైఎస్ఆర్టీపీకి ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ రాజీనామా చేశారు. పార్టీకి దిశానిర్దేశం చేయడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర నేతల మధ్య లుకలుకల కారణంగా పార్టీ పదవుల్లో నిజాయతీగా పని చేసే వారికి అన్యాయం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగానే ఒకరి మాటలు నమ్మి తనను పార్టీ నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆ వ్యక్తి తన నుంచి వ్యక్తిగతంగా ఆర్థిక లబ్ధి పొందారని తెలిపారు.