
జబర్దస్త్ స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా కొత్త సినిమా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి G.O.A.T అనే డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. సుధీర్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. G.O.A.T అంటే Greatest Of All Times అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు.
ఈ సినిమాలో బ్యాచిలర్ మూవీ ఫేం దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే పెరిగిపోయాయి. ఈ సినిమాను లక్కీ మీడియా–మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్‌పై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తుండగా.. పాగల్ మూవీ ఫేం నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నాడు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో కానీ.. వచ్చే ఏడాది మొదట్లో కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
గాలోడు వంటి సూపర్ హిట్ తరువాత సుడిగాలి సుధీర్ నుండి వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందా అనేది చూడాలి మరి.