తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినా జనాలు మంచం దిగడం లేదు. ఆస్పత్రిలు.. క్లినిక్లు బిజీ బిజీగా ఉన్నాయి. సుమారు ఒక నెల రోజులు పడిన వర్షాలు జనాలకు తిప్పలు తెచ్చి పెట్టాయి. విరామం లేకుండా వానలు కురిశాయి. ఇగచాలు వానదేవుడా..పోయిరా! అని జనాలు మొత్తుకున్నారు. అయితే వర్షాలు ఆగినా.. జ్వరం, తలనొప్పి.. జలుబు.. దగ్గు .. ముక్కులకు సర్ది పట్టి.. గాలి పీల్చలేకుండా తయారైంది. గోలీలు వేసుకుంటే సద్ది పోవడం లేదు. అయితే కొన్ని చిట్కాలతో సర్ది తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read :- మీ బీపీ తగ్గాలంటే.. ఉదయాన్నే ఈ ఫ్రూట్ మిక్స్ డ్రింక్స్ తాగండి..!
- అల్లంటీ తాగితే ముక్కు కారటం తగ్గుతది.
- నీళ్లు వేడి చేసుకొని.. గోరు వెచ్చని నీళ్లు మూడు రోజులు వరుసగా తాగితే జలుబే కాదు.. గొంతు నొప్పి, దగ్గు కూడా మాయమైతాయి
- వేడి నీళ్లలో చిటికెడు ఉప్పు వేసుకొని తాగితే ఇంకా మంచిది
- పసుపుని వేడి వేడి పాలల్లో వేసుకొని తాగితే దెబ్బకు సర్ది పోతది.
- ఒక టేబుల్ స్పూన్ తేనె రోజుకు రెండుసార్లు తాగాలి.
- వేడి కూరగాయలు లేదా చికెన్. సూప్ తాగినా సర్ది మాయమైతది.
- యూకలిప్టస్ నూనెతో ఆవిరి పీల్చినా సర్ది పోతుంది.
- ఆరెంజ్, ఆకుకూరలు తినడం వల్ల శ్వాసకోశ క్లియర్ అయితది.
- అవిసి గింజల్ని పది నిమిషాల పాటు నీళ్లలో వేసి ఉడకపెట్టి, ఆ నీళ్లలో నిమ్మరసం కలిపి తాగాలి.
- రోజు రెండుసార్లు గ్రీన్ టీ తాగడం వల్ల కూడా మంచి ఫలితం కనపడుతది.
- ఈ చిట్కాలతో పాటు మంచి నిద్ర కూడా. చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
-వెలుగు, లైఫ్–