భద్రాద్రికొత్తగూడెం/టేకులపల్లి, వెలుగు : టేకులపల్లి మండలం బొమ్మనపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న ఆది ములపు శైలజ(58) సోమ వారం ఆకస్మికంగా మృతి చెందారు. చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీ ఇంట్లో శ్వాసకోశ వ్యాధితో ఆమె కొంత కాలంగా బాధపడ్తున్నారు.
శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది కలగడంతో ఆమె కొత్తగూడెం పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు ట్రీట్మెంట్కు వెళ్లారు. అదే టైంలో ఆమెకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా హాస్పిటల్లోనే కుప్ప కూలి చనిపోయారు. ఆమెకు పలు టీచర్స్ యూనియన్ల నాయకులు సంతాపాన్ని ప్రకటించారు.