నిజాం షుగర్స్ రీ ఓపెన్‌‌‌‌‌‌‌‌కు వెయ్యి కోట్లు కేటాయించాలి: చెరుకు రైతుల సంఘం

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: నిజాం షుగర్ ఫ్యాక్టరీల రీఓపెన్​ కోసం బడ్జెట్ లో రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని ముత్యంపేట, బోధన్, మంబోజుపల్లి ఫ్యాక్టరీల పరిధిలోని చెరుకు రైతులు మంత్రి శ్రీధర్ బాబును కోరారు. గురువారం ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల చెరుకు రైతుల సంఘం లీడర్లు  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత సర్కారు పాలనలో స్వలాభం కోసం ఫ్యాక్టరీలు రీ ఓపెన్ చేయకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వందలాది ఎకరాల ఫ్యాక్టరీల స్థలాలను అమ్ముకుందుకు కొందరు కుట్రలు చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో రైతులు రాజేందర్, నారాయణ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లింబరెడ్డి, అశోక్, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులు, ఫ్యాక్టరీల రీఓపెన్​ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.