బోధన్,వెలుగు: నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం నాయకులు ఆదివారం నిజామాబాద్లో టీఎన్జీవో భవన్లో ఎమ్మెల్సీ కొదండరాంను కలిసి వినతిపత్రం అందించారు. ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించాలని, కార్మికులకు రావాల్సిన బకాయి వేతనాలు ఇప్పించాలని, కార్మిక కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవాలని, ప్రభుత్వం నియమించిన కమిటీ తొందరగా నిర్ణయం తీసుకొని ఫ్యాక్టరీని ప్రారంభించాలని కోరారు.
దీంతో ఎమ్మెల్సీ కోదండరాం సానుకూలంగా స్పందించి కార్మికుల సమస్యలు సీయం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకవెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో కార్మిక సంఘం నాయకులు ఉపేందర్, రవిశంకర్ గౌడ్, పోల్కా స్వామి, శ్రీధర్, హరిచంద్ , కార్మికులు పాల్గొన్నారు.