డయాబెటిక్ పేషెంట్స్ డ్రై ఫ్రూట్స్ తినొచ్చా... ఒకవేళ తినొచ్చంటే రోజుకు ఎన్ని డ్రై ఫ్రూట్స్ తినాలి... డ్రై ఫ్రూట్స్ షుగర్ పేషంట్లకు హాని చేస్తాయా.. తింటే ఏమవుతుంది.. డ్రై ఫ్రూట్స్ డయాబెటిక్ పేషెంట్స్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం. . . .
ఫ్రెష్ ఫ్రూట్స్ ను ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్ ను తయారు చేస్తారు. ఆ ప్రాసెస్ వల్ల డ్రై ఫ్రూట్స్ లో విటమిన్స్, మినరల్స్, యాంటి ఆక్సిడెంట్స్... నేచురల్ ఫ్రక్టోజ్ ఎక్కువుగా ఉంటాయి. అయితే తాజా పండ్లతో పోలిస్తే డ్రై ఫ్రూట్స్ లో ఇవి ఎక్కువుగా ఉంటాయి. దీంతో కొందరు ఎక్స్ పర్ట్స్ డయాబెటిక్ పేషెంట్స్ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల పోషకాలు అందుతాయని... తీపి తినాలనిపించే కోరిక తగ్గుతుందని చెబుతుంటారు. మరి కొందరు మాత్రం డ్రై ఫ్రూట్స్ కు బదులు గ్లైజమిక్ తక్కువుగాఉన్న ఫ్రూట్స్ ను తినడమే మేలు అంటున్నారు. కాని మెడ్ ఇండియా మెడికల్ రివ్యూ చేసిన స్టడీ ప్రకారం డయాబెటిక్ పేషెంట్స్ గ్లైసమిక్ తక్కువుగా ఉన్న డేట్స్, ఆఫ్రికాట్స్, కిస్మిస్ మాత్రమే తినాలి. ఇవి షుగర్ కేవింగ్స్ ను కంట్రోల్ చేస్తాయి. తినొచ్చారని ఎక్కువ తినకూడదు. రోజుకు రెండు లేదా మూడు మాత్రమే తినాలని చెబుతున్నాయి రీసెర్చ్ లు.