డయాబెటిక్ షేషెంట్లు కొన్ని రకాల ఆహారాపదార్థాలను వారి డైట్ లో చేర్చుకోవాలి. ఇవి వారి ఆరోగ్యానికి వరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పూర్వకాలంలో దాదాపు 60 ఏళ్ల వయస్సులో డయాబెటిక్ వ్యాధి వచ్చేది. కాని అప్పుడు అంతగా వైద్య సదుపాయం అందుబాటులో ఉండేది కాదు. ఆ కాలంలో అందరూ కృత్రిమ వైద్యంపై ఆధారపడి కొన్ని రకాల ఆహార పదార్ధాలను తీసుకొనేవారు. దీంతో వారికి మధుమేహం ( రక్తంలో షుగర్) కంట్రోల్ లో ఉండేది. దీనికి తోడు తగిన వ్యాయామం.. పని చేసే వారు..
కాని నేటి ఆధునిక యుగంలో చాలా చిన్నవయస్సులోనే మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారు. అంటే 20 సంవత్సరాల వాళ్లు కూడా నిత్యం షుగర్ గోళీలు మింగుతున్నారు. కొంతమందికి డీఎన్ఏ వలన వస్తే.. మరికొంతమందికి వారు తినే ఆహారపదార్థాల వలన వస్తుంది. ఇక వ్యాయామం అంటారా.. ఏదో కొద్దిసేపు వాకింగ్ చేసి అలసి పోతున్నారు. ఏసీ కింద.. కంప్యూటర్ ముందు పని.. శరీరానికి తగిన శ్రమ లేకపోవడం.. ఎప్పుడు పడితే అప్పుడు.. ఏది పడితే అది తినడం.. ఇలా ప్రస్తుతం జీవన శైలి అలవాటయింది. అయితే కొన్ని రకాల ఆహారపదార్థాలను తింటే డయాబెటిక్ కంట్రోల్ లో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధిగ్రస్థులు తినాల్సిన ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం..
కొవ్వు చేపలు: ఇవి షుగర్ వ్యాధి గ్రస్తులకు చాలా మంచిది. ఇందులో ఒమేగా 3ఎస్ ఉంటుంది. గుండె సమస్య రాకుండా ఎంతో ఉపనయోగపడుతుంది. ఇంకాసాల్మన్, మెకరెల్, సార్డినైన్ వంటి చేపలు డైట్లో చేర్చుకోవాలి. ఇవి శరీరానికి కావలసిన ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తాయి. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు ఈ చేపలు డైట్లో చేర్చుకోవాలి.
తృణ ధాన్యాలు: ఇవి చాలా తేలికగా జీర్ణం అవుతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతాయి. షుగర్ పేషంట్లు రోజు ఉదయం సాయంత్రం ఓట్స్, క్వినోనా, బార్లీ వంటి ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తినాలి. వీటివలన రక్తంలో చక్కెర స్థాయి.. హెచ్చు.. తగ్గులు లేకుండా ఉంటుంది.
గింజలు: షుగర్ వ్యాధితో బాధ పడే వారు కొన్ని రకాల గింజలను రాత్రి నానబెట్టి ఉదయం వాటిని తినాలి. వీటి వలన ఆరోగ్యకరమైన కొవ్వు శరీరానికి అందుతుంది. బాదం, వాల్ నట్స్, పిస్తా వంటివి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ తో పాటు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
చిలకడదుంప: ఇది షుగర్ పేషంట్లకు చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిని పెరగనీయకుండా... చిలకడదుంపలో గ్లైసమిక్ సూచి చాలా తక్కువుగా ఉంటుంది. ఇందులో శరీరానికి కావలసిన ఆరోగ్యమైన ఖనిజాలు ఉంటాయి. రోజు ఒకటి తింటే చాలు.. చాలా ఆరోగ్యంగా ఉంటారు. షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. గుండెకు చాలా బలమైన ఆహారం చిలకడదుంప..
బీన్స్: వీటిని షుగర్ పేషంట్లు తప్పని సరిగా ఆహారంలో చేర్చుకోవాలి. ఇది కొద్దిగా తిన్న కడుపు నిండుతుంది, త్వరగా ఆకలి వేయదు.క్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. బీన్స్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి..కాబట్టి ఆరోగ్య కరం ... షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పకుండా డైట్లో చేర్చుకోవాలి.