ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ ​చేయాలి: చెరుకు రైతుల డిమాండ్​

  • ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్​చేయాలి
  • చెరుకు రైతుల డిమాండ్​
  • లేకుంటే ప్రతి గ్రామం నుంచి నామినేషన్లు వేస్తామని హెచ్చరిక


జగిత్యాల: కోరుట్ల నియోజకవర్గంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభించాలని చెరుకు రైతులు   డిమాండ్ చేశారు. ఈమేరకు ఇవాళ ఇబ్రహీంపట్నం మండలకేంద్రంలో సమావేశమయ్యారు. రేపు కోరుట్ల పట్టణంలో జరగబోయే బీఆర్ఎస్ ప్రచార బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలన్నారు. లేనిపక్షంలో గత పార్లమెంట్ ఎన్నికల తరహాలో ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు.

ALSO READ :- వృద్ధుడిని ఢీకొట్టిన ఎమ్మెల్సీ కాన్వాయ్