రైతుల శ్రేయస్సు కోసం సమష్టిగా కృషి చేయాలి: ఈగ సంజీవరెడ్డి

మోపాల్, వెలుగు: సొసైటీ పాలకవర్గాలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారం కోసం సమష్టిగా కృషి చేయాలని నుడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి పేర్కొన్నారు. గురువారం నగర శివారులోని బోర్గం(పి)లో డీసీసీబీ డైరెక్టర్, సొసైటీ చైర్మన్​ చంద్రశేఖర్​రెడ్డి అధ్యక్షతన సొసైటీ మహాజనసభ నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సంజీవరెడ్డి మాట్లాడుతూ.. సొసైటీ పర్యవేక్షణలో ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. 

ALSO READ : సీఎం కేసీఆర్​ పునరాలోచన చేయాలి : శ్రీరాములు

బోర్గాం (పి) సొసైటీ ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు, అన్ని అంశాల్లో ముందంజలో ఉందని, సొసైటీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. సొసైటీ పాలకవర్గం చైర్మన్ సంజీవరెడ్డిని సన్మానించింది. సొసైటీ కార్యదర్శి కృష్ణ, డైరెక్టర్లు పాల్గొన్నారు.