దంగల్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన నటి సుహాని భట్నాగర్(Suhani bhatnagar) కన్నుమూశారు. ఆ సినిమాలో ఆమె ఆమిర్ ఖాన్ చిన్న కూతురుగా కనిపించారు. కేవలం 19 ఏళ్ళ వయసున్న సుహాని భట్నాగర్ మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఫరీదాబాద్ కు చెందిన సుహానికి కొంత కాలం క్రితం ఆక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో ఆమె కాలుకు తీవ్రమైన గాయం అవడంతో ట్రీట్మెంట్ కోసం చాలా కాలం హాస్పిటల్ లోనే ఉండాల్సి వచ్చింది. అయితే.. ఆమెకి ఇచ్చిన మెడిసిన్స్ తో సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల శరీరంలో విపరీతంగా మార్పులు వచ్చాయి.
దాంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో కన్ను మూశారు సుహాని. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రాముఖులు ఆమెకు సంతాపం తెలుపుతున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎంతో భవిష్యత్తు ఉంటుందనుకున్న సుహాని భట్నాగర్.. ఇలా ఆకస్మాత్తుగా మరణించడంతో ఆమె అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.