టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ (Suhas) ఈ మధ్య వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్గా అమ్మాజీపేట మ్యారేజి బ్యాండ్, ప్రసన్న వదనం వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత జనక అయితే గనక (Janaka Aithe Ganaka) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి మరోసారి అలరించాడు.
అక్టోబర్ 12న దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఓ భిన్నమైన కాన్సెప్ట్తో వచ్చి ఆడియన్స్ను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఇవాళ గురువారం (నవంబర్ 7న )ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. అయితే, నవంబర్ 8 న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన.. చెప్పిన తేదీ కంటే ముందే ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.
" మిడిల్ క్లాస్ గోల్డెన్ టిప్స్ కావాలా?.. అయితే 'జనక అయితే గనుక' చూసేయండి! ఇందులో రోలర్ కోస్టర్ ఎమోషన్స్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటోంది.." అనే క్యాప్షన్ తో ఆహా వెల్లడించింది.
మిడిల్ క్లాస్ గోల్డెన్ టిప్స్ కావాలా?💁🏻♂️
— ahavideoin (@ahavideoIN) November 7, 2024
అయితే 'జనక అయితే గనుక' చూసేయండి!😄
Watch #janakaaitheganaka only on ahaGold ▶️https://t.co/xUgh0lyVBF
#janakaaitheganakaonaha @ActorSuhas @sangeerthanaluv @KalyanKodati @kk_lyricist @HR_3555 #HanshithaReddy @DilRajuProdctns pic.twitter.com/6eqvFpoKFH
కథేంటంటే?
ఓ సాదాసీదా సేల్స్ మ్యాన్ ఉద్యోగం చేసే హీరో.. ఖర్చులకు భయపడి పెళ్లి చేసుకున్నా అప్పుడే పిల్లలు వద్దనుకుంటాడు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అతని భార్య గర్భం దాలుస్తుంది. దీనికి కారణం కండోమ్ కంపెనీయే కారణమంటూ కేసు వేసి కోర్టుకెక్కుతాడు. దీంతో సుహాస్ కండోమ్ తయారు చేసే సంస్థపైనే కేసు వేసే సన్నివేశాలతో కూడిన కోర్టు రూమ్ డ్రామా కథేంటి అనేది మిగతా స్టోరీ.