Prasanna Vadanam Teaser: మొహం కనిపించని వ్యాధితో సుహాస్.. థ్రిల్ చేస్తున్న ప్రసన్నవదనం

Prasanna Vadanam Teaser: మొహం కనిపించని వ్యాధితో సుహాస్.. థ్రిల్ చేస్తున్న ప్రసన్నవదనం

ఇటీవలే అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్(Ambajipeta Marriage Band) తో హిట్ అందుకున్న సుహాస్(Suhas) మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ప్రసన్నవదనం(Prasanna Vadanam). కొత్త దర్శకుడు అర్జున్(Arjun) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్ పై మణికంఠ, ప్రసాద్ రెడ్డి నిర్మిస్తుండగా.. వైవా హర్ష, సాయి శ్వేతా, నితిన్ ప్రసన్న కీ రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

ప్రసన్నవదనం టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాతో మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సుహాస్. ఎవరి మొహాలు సరిగా కనిపించని ఫేస్ బ్లైండ్ నెస్ అనే వింత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిగా కనిపించనున్నాడు సుహాస్. మొహాలు కనిపించడకోవడమే కాదు గుర్తుకూడా పట్టలేడు. అలాంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది, ఆ సమస్య వల్ల అతను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి అనేది ఈ సినిమా. టీజర్ చూస్తుంటే ఈ సినిమా దర్శకుడు అర్జున్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడని క్లియర్ గా అర్థమవుతోంది. మరి వినూత్న కాన్సెప్ట్ తో వస్తున్నప్రసన్నవదనం సినిమాకుక్ సుహాస్ కు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి.