Suhas: మన కథ ‘బొమ్మరిల్లు’ సినిమా కాదు.. ‘రక్తచరిత్ర’.. ఆసక్తిగా సుహాస్ కొత్త మూవీ టీజర్

Suhas: మన కథ ‘బొమ్మరిల్లు’ సినిమా కాదు.. ‘రక్తచరిత్ర’.. ఆసక్తిగా సుహాస్ కొత్త మూవీ టీజర్

టాలెంటెడ్ హీరో సుహాస్ కొత్త సినిమా టీజర్ రిలీజయ్యింది. నేడు (మార్చి 24న) ‘ఓ భామ అయ్యో రామ’(O Bhama Ayyo Rama) అనే సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో రానున్న ఈ సినిమా టీజర్ ఆసక్తిగా ఉంది.

హీరో, హీరోయిన్స్ మధ్య వచ్చే సీన్స్ ఆద్యంతం నవ్వుకునేలా ఉన్నాయి. మన కథ ‘బొమ్మరిల్లు’సినిమా కాదు.. ‘రక్తచరిత్ర’అంటూ హీరోయిన్‌ చెప్పిన డైలాగు ఆకట్టుకుంటోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సుహాస్ కి.. ఈ సినిమాతో మరి మంచి సక్సెస్ దక్కేలా ఉంది ఈ టీజర్. సమ్మర్ కానుకగా థియేటర్లో సందడి చేయనుంది. 

Also Read : బెట్టింగ్ యాప్ కేసు..విచారణకు హాజరైన శ్యామల

ఇకపోతే  చిత్రానికి రామ్ గోదాల దర్శకుడు. మాళవిక మనోజ్ హీరోయిన్. హ‌‌రీష్ న‌‌ల్లా, ప్రదీప్ తాళ్లపు రెడ్డి నిర్మిస్తున్నారు. ఉదయ్ కిరణ్ మూవీ 'నువ్వు నేను' ఫేమ్ అనిత కీ రోల్లో కనిపించబోతుంది. దర్శకుడు హరీష్ శంకర్ ఇందులో ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. ప్రేక్షకులను సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌ చేసేలా ఈ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. రథన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫొటో, రైటర్ పద్మభూషణ్‌‌‌‌‌‌‌‌ చిత్రాలతో హీరోగా మెప్పించిన సుహాస్ వరుస మూవీస్ తో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగానే వచ్చిన  శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం, జనక అయితే గనక వంటి సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. త్వరలో సుహాస్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో ఓ మూవీ రానుంది. త్వరలో రిలీజ్ అప్డేట్ వచ్చే అవకాశముంది.