సూసైడ్ అటెంప్ట్ చేసిన మిస్ తెలంగాణ

సూసైడ్ అటెంప్ట్ చేసిన మిస్ తెలంగాణ

హైదరాబాద్‎లో ఓ యువతి ఆన్‎లైన్‎లో ఆత్మహత్యాయత్నం చేసింది. సమయానికి స్పందించిన పోలీసులు యువతిని కాపాడారు. వివరాలలోకి వెళ్తే.. హాసిని అనే యువతి నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని హిమాయత్‎నగర్ రోడ్ నెంబర్ 6లో ఓ అపార్ట్‎మెంట్‎లోని ఫ్లాట్‎లో ఉంటోంది. హాసిని 2018లో మిస్ తెలంగాణకు ఎంపికైంది. కాగా.. హాసిని ఈ రోజు ఉదయం సూసైడ్ అటెంప్ట్ చేసింది. పైగా తన సూసైడ్‎ను ఆన్‎లైన్‎లో పెట్టింది. గమనించిన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన యువతి ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఆమెను ప్రాణాలతో కాపాడగలిగారు. యువతిని వెంటనే హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తనను ఓ యువకుడు శారీరకంగా వేధిస్తున్నాడని హాసిని ఇటీవల జూబ్లీహిల్స్ పోలీస్‎స్టేషన్‎లో ఫిర్యాదు చేసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే హాసిని ఆత్మహత్యాయత్నం చేయడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. కేసు నమోదు చేసిన నారాయణగూడ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.