మా కూతురిని సాయి కొట్టాడు.. అందుకే చనిపోయింది..షాకింగ్ విషయాలు చెప్పిన పేరెంట్స్

మా కూతురిని సాయి కొట్టాడు.. అందుకే చనిపోయింది..షాకింగ్ విషయాలు చెప్పిన పేరెంట్స్

 ప్రియుడు పెట్టే వేధింపులు తట్టుకోలేక హైదరాబాద్ లో యువతి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై అఖిల తల్లిదండ్రులు వీ6తో మాట్లాడారు. తమ అమ్మాయి సాయి వెంట పడి మరి ప్రేమించాడని చెప్పారు. ఎనిమిదేళ్ళుగా అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని తెలిపారు. వారిద్దరి ప్రేమ విషయం తెలిసి ముందు వద్దన్నామని కానీ తమ అమ్మాయి మీద ఉన్న ప్రేమతో పెళ్ళికి కూడా ఒప్పుకున్నామని చెప్పారు. 

ముందు ఇద్జరు లైఫ్ లో సెటిలవ్వండి తరువాత పెళ్ళి చేస్తామని చెప్పామని తెలిపారు. కానీ గత కొద్ది రోజులుగా పెళ్ళి చేసుకోమంటే మాత్రం సాయి అయిష్టం వ్యక్తం చేశాడని తెలిపారు. తనకు చాలా కట్నం వస్తుందని అఖిలతో పలుమార్లు చెప్పాడని  దీంతో అబ్బాయికి కట్నం ఆశ ఉన్నట్లుంది అని అనుకున్నామని వేరే ఎవరికి ఇచ్చి పెళ్ళి చేసిన కట్నం ఇవ్వాల్సిందేగా అని అదేదో అమ్మాయిని ప్రేమించిన అతనికే ఇస్తే సరిపోతుందని అనుకున్నామని తెలిపారు.

 ఏమైందో తెలియదు కానీ నిన్న సాయంత్రం అఖిల సూసైడ్ చేసుకుందని చెప్పారు. గత నెల రోజులుగా డైరీ రాస్తుందని చనిపోవడనికి ముందు సూసైడ్ నోట్ రాసిందని తెలిపారు. డైరీ చదివినప్పుడు మా కూతురిని కొట్టాడని తెలిసిందని చెప్పారు. తమ కూతురి పై ఒక్కసారి కూడా చేయి చేసుకోలేదని అల్లారుముద్దుగా పెంచుకున్నామని తెలిపారు. అఖిల మృతికి కారణమైన అఖిల్‌గౌడ్ ను కఠినంగా శిక్షించాలపి డియాండ్ చేశారు.