మానుకోట ఇన్​చార్జి సబ్​ రిజిస్ట్రార్​గా సుజాత

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు: మహబూబాబాద్​ ఇన్​చార్జి సబ్​ రిజిస్ట్రార్​ గా దామల్ల సుజాత శనివారం సాయంత్రం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పని చేసిన  సబ్​ రిజిస్ట్రార్​ ​ మహమ్మద్​ తస్లీమా ఏసీబీకి చిక్కన విషయం తెలిసిందే.   ఆమె స్థానంలో ములుగులో పని చేస్తున్న సబ్​రిజిస్ట్రార్​ సుజాతను ఇక్కడ ఇన్​చార్జిగా  నియమిస్తూ  ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.