వాలంటైన్స్ డే రోజున స్టార్ హీరోయిన్ కి ఖరీదైన విమానం గిఫ్ట్ ఇచ్చిన ప్రియుడు. నిజమేనా...?

వాలంటైన్స్ డే రోజున స్టార్ హీరోయిన్ కి ఖరీదైన విమానం గిఫ్ట్ ఇచ్చిన ప్రియుడు. నిజమేనా...?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గతంలో ప్రముఖ బిజినెస్ మెన్ సుఖేష్ చంద్ర శేఖర్ తో ప్రేమలో పడిందని ఈ క్రమంలో రూ.కోట్లు విలువ చేసే ఖరీదైన బహుమతులు కూడా పొందిందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో జాక్వెలిన్ పలుమార్లు ఈడీ విచారణలకి కూడా హాజరైంది. అయితే వాలంటైన్స్ డే రోజున మరోసారి వీరి ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం సుఖేష్ జైలులో ఉన్నప్పటికీ తన ప్రేయసి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి ఉత్తరాల రాయడం మాత్రం ఆపడం లేదు. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే రోజు కావడంతో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి 2 పేజీల ఉత్తరం రాసాడు. ఇందులో "బేబీ నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. నువ్వు ప్రపంచంలోనే అత్యుత్తమ వాలెంటైన్, నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను. బేబీ, నీకు తెలుసా.. వాలెంటైన్స్ డే మనకి ఎంత ప్రత్యేకమైనదో మన సంబంధం వాలెంటైన్స్ రోజున ప్రారంభమైంది, మనం ఒకరినొకరు క్షమించి, అంగీకరించిన రోజు. ఇది ఎల్లప్పుడూ మన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజుగా ఉంటుంది." అంటూ లవ్ లైన్స్ రాశాడు.

ALSO READ | దబిడి దిబిడి సాంగ్ కి జపాన్ అమ్మాయిల మాస్ స్టెప్స్.. గ్లోబల్ వైడ్ గా ట్రెండింగ్...

అంతేకాదు వాలెంటైన్స్ డే బహుమతిగా ప్రత్యేకంగా తయారు చేయబడిన గల్ఫ్‌స్ట్రీమ్ జెట్ ని గిఫ్ట్ గా ఇస్తానని,  ఈ జెట్ కి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లోని JF అక్షరాలను కలిపి రిజిస్ట్రేషన్ చేయించానని తెలిపాడు. అయితే ఈ జెట్ ని కొనడానికి ఖర్చు చేసిన డబ్బుని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో కూడా చూపిస్తానని వెల్లడించాడు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

సుఖేష్ చంద్రశేఖర్ భగ్న ప్రేమికుడిని అందుకే జైలులో ఉన్నప్పటికీ తన ప్రేయసిని మరువకుండా ఉత్తరాలు రాస్తూ, ఖరీదైన బహుమతులు ఇస్తానని చెబుతూ సంతోష పెడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి దిక్కుమాలిన ఉత్తరాలు రాస్తూ అనవసరంగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇమేజ్ దెబ్బతీయద్దని అంటున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రస్తుతం తెలుగులో ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాని రెండు పార్ట్స్ గా రిలీజ్ చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి పార్ట్  హరిహర వీరమల్లు పార్ట్-1: ది స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ మార్చ్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.