జ్యోతిష్యం: ఏప్రిల్​ 13న .. మీనరాశిలోకి డైరక్ట్​గా శుక్రుడు.. 3 రాశుల వారికి బంపరాఫర్​..

జ్యోతిష్యం: ఏప్రిల్​ 13న .. మీనరాశిలోకి డైరక్ట్​గా శుక్రుడు..  3 రాశుల వారికి బంపరాఫర్​..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సంపదను కలుగజేస్తాడు.  జాతక రీత్యా  వ్యక్తి జాతకంలో శుక్రుడు అనుకూలించినప్పడు వారికి  ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  అలాంటి శుక్రుడు తన దిశను మార్చుకొని ప్రయాణించినప్పుడు  12 రాశుల వారి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం మీనరాశిలో వక్రమార్గంలో సంచరిస్తున్న శుక్రుడు .... ఏప్రిల్​ 13న తన దిశను మార్చుకొని ప్రత్యక్షంగా సంచరించనున్నాడు.  దీనివలన మూడు రాశుల వారికి ( వృషభ..ధనస్సు.. కుంభ)  అనుకూల ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం....

ALSO READ : 57 ఏళ్ల తర్వాత.. పంచగ్రహ కూటమిలో వస్తున్న హనుమాన్ జయంతి : ఏయే రాశి వారు ఎలాంటి మంత్రాన్ని జపించాలో తెలుసుకోండి..

 వృషభ రాశి: శుక్రుడు మీనరాశిలో నేరుగా సంచరించుట  వలన వృషభ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు.  వ్యాపారస్తులకు అనుకోని విధంగా లాభాలు వస్తాయి.  కార్యాలయంలో సముచిత స్థానం లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.  వృత్తి పరంగా విజయాలు వరించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

 ధనస్సురాశి: మీనరాశిలో శుక్రుడు ప్రత్యక్షంగా సంచరించడం వలన ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి,  పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు పెట్టుబడి పెట్టేందుకు ఇది అనుకూల సమయం.  నిరుద్యోగులకు జాబ్​ లభించే అవకాశం ఉంది.  కుటుంబసమస్యలు పరిష్కారమవుతాయి.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

 కుంభ రాశి: మీనరాశిలో  శుక్రుడి ప్రత్యక్షంగా సంచరించడంతో  ఈ రాశి వారు అద్భుత లాభాలను పొందుతారు.  కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్​.. జీతం పెరుగుదల ఉంటుంది.  గతంలో పెట్టిన   పెట్టుబడుల నుండి  అధిక లాభాలు పొందుతారు.  ఉన్నత స్థానంలో ఉండాలనే మీ కోరిక నెరవేరుతుంది. . కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు పెరుగుతుంది.  కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు ఇది అనుకూలమైన సమయం. జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.